హైదరాబాద్ : ఫిల్మ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఆస్పత్రిలో చేరాడు. అతను డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈనెల 20వ తేదీన అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. విజయ్ దేవరకొండ కానీ ఇతర సభ్యులు ఎవరూ ఈ విషయాన్ని ద్రువీకరించలేదు.
దేవరకొండ నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ ఈనెల 31వ తేదీన రిలీజ్ కానున్నది. కింగ్డమ్ చిత్రాన్ని గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. ఆ ఫిల్మ్‌లో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటిస్తున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్‌గా కింగ్డమ్ను రూపొందించారు.
వాస్తవానికి మార్చి 30న రిలీజ్ కావాల్సిన ఆ సినిమాను పోస్టు ప్రొడక్షన్ సమస్య వల్ల వాయిదా వేశారు. కింగ్డమ్ ఫిల్మ్‌కు చెందిన హిందీ వర్షన్‌ను థియేటర్లలో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ నటిస్తున్న డాన్ 3 చిత్రంలో విలన్ పాత్రలో విజయ్ దేవరకొండ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఫర్హన్ అక్తర్‌కు సంబంధించిన ఆ ఫిల్మ్‌లో విక్రాంత్ మాసే స్థానంలో దేవరకొండకు ఛాన్స్ దక్కినట్లు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.