Kushi | అగ్ర కథానాయిక సమంత (Samantha), టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఖుషీ’ (Kushi Movie). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీ (Turkey)లో జరుగుతోంది. టర్కీ షెడ్యూల్లో సమంత, విజయ్ పాల్గొంటున్నారు. షూటింగ్ మధ్యలో వీరిద్దరూ టర్కీ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read..
Mokshagna | గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్.. మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు..!
Pushpa-2 Movie | పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్
BCCI | బీసీసీఐ నిర్ణయం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం..