Mokshagna | నందమూరి అభిమానులకు అదిరిపోయే శుభవార్త వచ్చేలా కనిపిస్తుంది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటారు.. కానీ ఒక్కసారి కూడా అది నిజం కాదు అనుకోవచ్చు. కానీ ఈసారి నిజమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ వారసుడు ఎంట్రీ గురించి ఈమధ్య ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. దానికి తోడు కథా చర్చలు కూడా జరుపుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు మోక్షజ్ఞ కోసం బాలయ్య దగ్గర కథలు చెప్పినట్టు తెలుస్తుంది. అందులో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు. అన్నింటికీ మించి కొడుకు ఫ్యూచర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. వచ్చే ఎన్నికల నాటికి మోక్షజ్ఞ సినిమా లాంచ్ చేసి 2024 లో విడుదల చేయాలని బాలయ్య ప్లాన్. ఇక దానికి ముందే తను కూడా రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు బాలకృష్ణ. అందులో యంగ్ బాలయ్య పాత్రలో మోక్షజ్ఞ నటించబోతున్నాడని.. ఈసారి వార్త కన్ఫర్మ్ అని ఇండస్ట్రీలో బలంగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మోక్షజ్ఞకు అంతకంటే పవర్ ఫుల్ ఎంట్రీ మరొకటి ఉండదు అంటున్నారు నందమూరి అభిమానులు. కనీసం ఈసారైనా ఇది నిజం కావాలని కోరుకుందాం. కాగా మోక్షజ్ఞ కూడా కాస్త బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. హీరో లుక్ లోకి రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.