Pushpa-2 Movie | పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ నార్కట్‌పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ముగించుకుని పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోకి రాగానే.. అదుపు తప్పిన ప్రైవేటు బస్సు ఆగివున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సులో ఉన్న పలువురు ఆర్టిస్టులు స్వల్పంగా గాయపడ్డారు.
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రెండేండ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందాడు. రష్మిక మంధన్నా కూడా నేషనల్ క్రష్‌గా మారింది.