టాలీవుడ్లో సందడి చేయబోతున్న క్రేజీ కాంబినేషన్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda), సమంత (Samantha), ఈ ఇద్దరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ చిత్రాలను తెరకెక్కించిన శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. కశ్మీర్ షెడ్యూల్‌తో షూటింగ్ షురూ చేసింది శివ నిర్వాణ టీం.
అయితే చాలా రోజులుగా ఖుషి కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా షూటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఖుషి తాజా షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్ నగర శివార్లలోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో షురూ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై శివనిర్వాణ టీం ఏదైనా అధికారిక అప్డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఖుషి చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హేశమ్ అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ ఖాతాలో ఫీ మేల్ సెంట్రిక్ మూవీ శాకుంతలంతోపాటు హిందీ వెబ్ ప్రాజెక్ట్ సిటడెల్ కూడా ఉంది. ఈ మూవీలో వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్నాడు.
Samajavaragamana | సామజవరగమన అంటోన్న శ్రీవిష్ణు.. నయా అప్డేట్
Rashmika Mandanna | బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా రష్మిక మందన్నా.. ట్రెండింగ్‌లో ఫొటోలు, వీడియో
Chiranjeevi | కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ