Samajavaragamana | కథను నమ్మి సినిమాలు చేసే హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు శ్రీవిష్ణు (Sree Vishnu). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ సామజవరగమన (Samajavaragamana). వివాహ భోజనంబు ఫేం రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ వీడియో అప్డేట్ అందించారు.
సామజవరగమన గ్లింప్స్ వీడియోను రేపు ఉదయం 10:08 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను లాంఛ్ చేశారు. ఈ సినిమాలో బిగిల్ ఫేం రెబా మోనికా జాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంరెడ్డి కెమెరామెన్ కాగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది భళా తందనాన, అల్లూరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసే శ్రీ విష్ణు మరి ఈ సారి ఎలాంటి జోనర్లో సినిమా చేయబోతున్నాడన్నదానిపై రేపు క్లారిటీ రానుంది.
Our @sreevishnuoffl is in a party mood with all the Lovely Ladies out there! 🥳✨
Special Birthday Glimpse from #Samajavaragamana will be out Tomorrow @ 10:08 AM ⏰@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @_balajigutta @GopiSundarOffl @AKentsOfficial pic.twitter.com/KKLo5j5uGO
— Hasya Movies (@HasyaMovies) February 27, 2023
Nenu Student Sir | బెల్లంకొండ గణేశ్ నేను స్టూడెంట్ సర్ మూవీ విడుదల వాయిదా.. కారణమిదే
Rashmika Mandanna | బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా రష్మిక మందన్నా.. ట్రెండింగ్‌లో ఫొటోలు, వీడియో
Chiranjeevi | కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ