హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 30: ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకాలు, క్యాష్‌లెస్ వైద్యసేవలను అందిస్తున్న నెట్వర్ దవాఖానలకు బకాయిపడ్డ రూ. 2,500 కోట్లు చెల్లించాలని, సమస్యలు పరిషరించేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని తెలంగాణ నెట్వర్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ రాకేశ్ కోరారు. నెట్వర్ దవాఖానల ఆర్థిక సమస్యలు పరిషారం కాకపోతే చివరికి వాటిప్రభావం లబ్ధిదారులకు అందే వైద్యసేవలపై పడే ప్రమాదం ఉన్నదని పేరొన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య పథకాల కింద లబ్ధిదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు నెట్వర్ దవాఖానలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే నిర్వహణ వ్యయం పెరుగడం, ప్రస్తుత ప్యాకేజీ రేట్లు, పెండింగ్ బకాయిలు, చెల్లింపుల్లో జాప్యం, ఎంవోయూ నిబంధనలు, సమస్యల పరిషారానికి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం వంటి అంశాలు దవాఖానలకు ఇబ్బందికరంగా మారాయని వివరించారు.
వైద్యసేవలను అందించేందుకు వాస్తవంగా ఎంత ఖర్చవుతుందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, శాస్త్రీయ పద్ధతిలో ప్యాకేజీలను సర్కార్ నిర్ణయించాలని కోరారు. నెట్వర్ దవాఖానలు ఎదురొంటున్న అంశాలపై బుధవారం ఉదయం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోతో జరిగిన సమావేశంలో విసృ్తతంగా చర్చించినట్టు తెలిపారు. సమస్యలపై సీఈవో సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో డాక్టర్లు రమేశ్, ఎంవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.