మౌనమే తపస్సు
గురునానక్ ఐక్యతకు ప్రతిరూపం. మతసామరస్యాన్ని బోధించిన మహనీయుడు ఆయన. మత విద్వేషాలు, అరాచకం ప్రబలుతూ ప్రజలు అనైతికతకు పాల్పడుతున్న రోజుల్లో నానక్ బోధనలు కొత్తదారిని చూపాయి. ‘కులం, మతం ద్వారా వ్యక్తి హోదాను నిర్ణయించలేం.
- మంగళవారం గురునానక్ జయంతి
గురునానక్ ఐక్యతకు ప్రతిరూపం. మతసామరస్యాన్ని బోధించిన మహనీయుడు ఆయన. మత విద్వేషాలు, అరాచకం ప్రబలుతూ ప్రజలు అనైతికతకు పాల్పడుతున్న రోజుల్లో నానక్ బోధనలు కొత్తదారిని చూపాయి. ‘కులం, మతం ద్వారా వ్యక్తి హోదాను నిర్ణయించలేం. అన్ని కులాలు ఒకటే’ అని ఆయన సూక్తి. ఏ మతం అయినా ప్రేమనే బోధిస్తుంది. ఎదుటివారిని ప్రేమతోనే గెలవాలని చెబుతుంది. వ్యక్తి సాధుత్వం కలిగి ఉండాలి. మితంగా మాట్లాడాలి. సాటి మనుషులపట్ల స్నేహభావం కలిగి ఉండాలి. మహిళలను గౌరవభావంతో చూడాలి. గురునానక్ చేసిన బోధనలు ఇవి. ఒక ప్రత్యేక మతాన్ని స్థాపించినా.. పరమత సహనాన్ని కూడా ఉద్బోధించారు.
గురునానక్ దేవ్ 1468లో కార్తిక పౌర్ణమినాడు, అవిభాజ్య భారతదేశంలోని తల్వండి (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తృప్తాదేవి, కాలూచంద్. చిన్నప్పటి నుంచి నానక్ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. కబీర్దాస్ బోధనలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎప్పుడూ ఏదో అన్వేషిస్తున్న వాడిలా తిరిగేవారు. భగవంతుడు ఒక్కడే అని ప్రబోధించారు. దుర్గుణాలు వీడటమే ఆధ్యాత్మిక సాధనకు మొదటి అర్హత. ఆయన బోధనలే కాదు, జీవితమూ నేటికీ ఆదర్శప్రాయం. జీవితంలో ఏనాడూ కోపం ఎరగని వ్యక్తి నానక్. ‘ఆ భగవంతుడి కృప నాపై ఉంది. ఎల్లప్పుడూ దైవచింతనలో గడిపేవారందరికీ దైవానుగ్రహం ఉంటుంది’ అనేవారు. అంతేకాదు మౌనాన్ని మించిన సాధన లేదని చెప్పేవారు. ‘మౌనంగా ఉండటం అంటే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడటం కాదు. ధర్మబద్ధమైన పనులు చేస్తూ,అందులో నిమగ్నులై ఉండటం కూడా తపస్సే. ఇది వ్యక్తులలోని రుగ్మతలనుపోగొడుతుంది’ అని బోధించారు గురునానక్.
శ్రీ…?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

