న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నిబంధనలను అధికారులు మరింత కఠినతరం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో నేటి నుంచి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే పెట్రోల్, సీఎన్జీ ఇవ్వనున్నారు.
ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజెమెంట్ (సీఏక్యూఎమ్) సెప్టెంబర్ 26న సమీక్షలో ఇచ్చిన ఆదేశాలను ఎన్సీఆర్ పరిధిలోని రాష్ర్టాల ప్రభుత్వాలు అమలు చేయనున్నాయి. అందులో భాగంగా పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసి పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరిస్తారు.