న్యూఢిల్లీ : రష్యా సైన్యంలో ఉద్యోగాలు అంటూ వస్తున్న ప్రకటనలు, నివేదికలను నమ్మొద్దని భారత విదేశాంగశాఖ మరోసారి హెచ్చరించింది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారు ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తెలిపింది. ఈ మేరకు అడ్వయిజరీ జారీ చేసింది.
రష్యా సైన్యంలోని ఉద్యోగాల్లో లాభ, నష్టాలను రెండేండ్లుగా వివరిస్తున్నా కొందరు నమ్మి మోసపోతున్నారని తెలిపింది. ధ్రువీకరించని వ్యక్తులు, సంస్థలు చేసే ఉద్యోగ ఆఫర్లను నమ్మొద్దని కోరింది. ఉద్యోగాల కోసం భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధం అవుతున్న వారినీ చూశామని, అది చాలా ప్రమాదకరం అని వివరించింది.