తమిళ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) కాంబోలో విజయ్ (Vijay 66th) 66వ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ 22న విజయ్ పుట్టినరోజు పురస్కరించుకుని మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వారిసు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ది బాస్ రిటర్న్స్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది.
ఈ క్రేజీ అప్డేట్ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్. టైటిల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు విజయ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. .కాగా వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందీ ప్రాజెక్టు.
WWM still of #Thalapathy @actorvijay from #Varisu #Vaarasudu 💥 #VarisuFirstLook#HBDDearThalapathyVijay 💖 @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp @SVC_official @PVPCinema #Thalapathy66 pic.twitter.com/gpxh4Kfbvd
— Vamsi Kaka (@vamsikaka) June 21, 2022
Read Also : Venu Udugula | విరాటపర్వం డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ సినిమా పరిస్థితేంటి..?
Read Also : Telugu film workers | సినీ కార్మికుల సమ్మె..రేపటి నుంచి షూటింగ్స్ బంద్
Read Also : Ganesh Acharya | విష్ణు, సన్నీ, పాయల్‌తో బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ స్టెప్పులు