మంచు విష్ణు (Manchu Vishnu), ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. VM19గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు జిన్నా అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇటీవలే టైటిల్ మార్చాలని అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో మార్పు ఉంటుందా..? అనేది తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya)ఈ సినిమాకు పనిచేయబోతున్నాడట.
సినిమాలో ఎంగేజ్మెంట్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఓ పార్టీ సాంగ్‌కు గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చనుండటమే కాకుండా..స్క్రీన్‌పై కూడా మెరువనున్నారని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ పాటను మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబుపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ట్రిపుర్ ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా ఈ ప్రాజెక్టులో లీడ్ పెయిర్ మీద వచ్చే ఎనర్జిటిక్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయబోతుండటం.
అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నాడు. మంచు విష్ణు హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.మరోవైపు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది