ఈ రోజుల్లో స్టార్ హీరోల బర్త్‌డే వస్తుంది అంటే అభిమానులు వారం రోజుల ముందు నుండే సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ కలిగిన హీరో ఇళయదళపతి విజయ్ బర్త్‌డే ఈ నెల 22న కాగా, ఆయన అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతూ.. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్‌డే విజయ్ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
ఇక మాస్టర్ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్.. విజయ్‌కి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో విజయ్ నటించిన 64 చిత్రాలకు సంబంధించి విజయ్ ముఖ చిత్రాలు ఉన్నాయి. ఈ లుక్స్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని జూన్ 21న సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నారు. దళపతి 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. త్వరలో తెలుగులో స్ట్రైట్ మూవీ చేసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నాడు.
Here is our #Thalapathy Birthday Special ❤❤
— Seven Screen Studio (@7screenstudio) June 18, 2021
Advance birthday wishes to our beloved #Master @actorvijay sir ❤❤#HappyBirthdayThalapathy #June22
@Lalit_SevenScr pic.twitter.com/txftucrFTD