Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) నేడు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) కూడా నయన్‌కి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే నయనతార. లవ్ యూ మై ఉయిర్, ఉలగం. నా జీవితం యొక్క అందం, అర్థం మీరు.. మీ సంతోషమే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు.
Nayanthara Vignesh Shivan2
Also Read..
Minister KTR | షాదాబ్‌లో బిర్యానీ.. మొజంజాహీలో ఐస్‌క్రీం.. నగరంలో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ సందడి
Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య
Sabarimala Temple | శబరిమలకు పోటెత్తిన భక్తులు