Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య
Naga Chaitanya | ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Nagachaitanya).. ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో NC23 (NC23) సినిమాతో బిజీగా ఉన్నాడు. చైతూ ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ (Youtube Channel)ను ప్రారంభించాడు.
Naga Chaitanya | ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Nagachaitanya).. ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో NC23 (NC23) సినిమాతో బిజీగా ఉన్నాడు. చైతూ ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ (Youtube Channel)ను ప్రారంభించాడు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్ ద్వారాను ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన చిత్ర ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చైతూ వచ్చి చేరాడు. ‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ‘జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా..?’ అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా జాబ్ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు చెప్పాడు. పనేంలేక జుట్టు, గడ్డం పెంచినట్లు సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న చిత్రం కోసం పెంచినట్లు క్లారిటీ ఇచ్చాడు.
ఫిషర్మెన్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న NC23ని పాపులర్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై తెరకెక్కిస్తోంది. విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో చైతూ నటించిన వెబ్ ప్రాజెక్టు ధూత (Dhootha). ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ధూత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1 స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే అప్డేట్ వచ్చింది.
Also Read..
ఆ పాత్రకు ఎలాంటి ముగింపునిచ్చాడో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

