VidaaMuyarchi Trailer | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చి (Vidaa Muyarchi) ఒకటి. ఏకే 62గా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్‌ను ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారనే దానిపై రేపు క్లారిటీ ఇవ్వనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్ర పోషిస్తుండగా.. రెజీనా కసాండ్రా మరో కీ రోల్లో నటిస్తోంది. ఆరవ్ కీ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విదాముయార్చి నుంచి షేర్ చేసిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63 కూడా చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని జనవరి 31న కానీ లేదా ఫిబ్రవరి 7న కానీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
[BREAKING] 🚨
The Most Anticipated #VidaaMuyarchiTrailer Announcement Is Tomorrow 😎🔥
Get Ready To Celebrate it MASSIVELY!#Vidaamuyarchi | #Ajithkumar
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) January 13, 2025
Balakrishna | ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు.. ముద్దులతో ముంచెత్తిన డాకు మహారాజ్.. Video
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు