Vidudhala Part 2 | సహజత్వంతో కూడిన సినిమాలు చేసే అతికొద్ది మంది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సూపర్ బజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీక్వెల్ విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2). వెనుక బడిన ప్రజల కోసం పోరాడే పెరుమాళ్ స్టోరీగా.. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా ఈ సినిమా కోసం రియలిస్టిక్‌గా ఉండేలా వెట్రిమారన్ ప్రత్యేకంగా ఊరినే సృష్టించాడు. నిజంగానే ఊరు ఇప్పటికే ఉన్నదా అన్నట్టుగా అనిపించే మేకింగ్ వీడియో ఇప్పుడు సినిమాపై హైప్ మరింత పెంచేస్తుంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్లో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్‌లో సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని నేను మొదలుపెట్టినప్పుడు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటు వాదం దేనితోను మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైందీ భయం అంటూ మొదలైన అయిన ట్రైలర్.. హింస మా భాష కాదు.. కానీ ఆ భాష కూడా మాకు మాట్లాడటం వచ్చనే డైలాగ్స్‌తో అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
మేకింగ్ వీడియో..
Director #VetriMaaran‘s #ViduthalaiPart2 Movie Making Video.. 🔥#Soori #ManjuWarrier #VijaySethupathi pic.twitter.com/M6Ab5hMSTI
— Gowri Aaradhana (@aaradhana_gowri) December 14, 2024
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!