Ghaati | చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్కా శెట్టి (Anushka Shetty). దతెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఈ సుందరి లీడ్ రోల్లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. స్వీటీ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటి (Ghaati) సినిమా చేస్తుందని తెలిసిందే. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ ప్రీ లుక్‌తోపాటు మరో పోస్టర్ కూడా నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న మూవీ లవర్స్, ఫాలోవర్ల కోసం ఎక్జయిటింగ్ వార్త ఒకటి షేర్ చేశారు. ఇవాళ తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్నట్టు తెలిపారు. ది క్వీన్ అనుష్క ముఖంపై రక్తపు మరకలుండగా.. మరోవైపు కన్నీళ్లను కూడా చూడొచ్చు. మైనర్ ప్యాచ్ వర్క్‌తో చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తుండగా.. దీనిపై క్రిష్ కాంపౌండ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 2025 మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో ఘాటి ఉండబోతుందని ఇప్పటివరకు వచ్చిన కథనాల సారాంశం. ఈ మూవీ నుంచి జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్ ఒకటి షేర్ చేయగా.. ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
It’s time for ‘The Queen’ to reign on the big screens worldwide ❤🔥#Ghaati announcement tomorrow at 12:00 PM ❤🔥
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.
‘The Queen’ #AnushkaShetty @DirKrish @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/sTpydeDl23
— BA Raju’s Team (@baraju_SuperHit) December 14, 2024
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ