Dharmendra | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో(Breathlessness) ఇబ్బంది రావడంతో ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. 89 ఏళ్ల వయసున్న ధర్మేంద్ర కొన్ని రోజులుగా సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే శుక్రవారం అతడికి శ్వాస ఆడకపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన గుండె స్పందన రేటు (Heart Rate) 70, రక్తపోటు (Blood Pressure) 140/80 వంటి పారామీటర్లు సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ధర్మేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘ఇక్కిస్’ (Ikkis). వార్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 2025లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.