Stampede : శ్రీకాకుళం (Srikakulam) కాశీబుగ్గ (Kasibugga) వేంకటేశ్వర స్వామి ఆలయం (Vekateswara Swamy temple) లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.
గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల తాకిడికి రెయిలింగ్ ఊడిపోయి పలువురు కిందపడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


