Roshan Meka | హీరో శ్రీకాంత్ (Actor Srikanth) తనయడు రోషన్(Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల తేదీతో పాటు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) కథానాయికగా నటిస్తుంది.