లండన్: ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha) భారీ మెజారిటీతో గెలిపించాలని లండన్‌లోని ఎన్ఆర్ఐలు జూబ్లీహిల్స్ (Jubilee Hills By-Election) ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాల్నా? బుల్డోజర్ రావాల్నా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నమ్మి గ్రామాల్లో మోసపోయినట్టుగా, హైదరాబాద్ ప్రజలు మోసపోవద్దని కోరుకుంటున్నామని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్ నుంచే మొదలైందని, హైడ్రాతో హైదరాబాద్ బ్రాండ్‌ని నాశనం చేశారని విమర్శించారు. సామాన్య పేద ప్రజలకు ఇల్లు లేకుండా రోడ్డున పడేశారని, ప్రజలంతా ఓటు ద్వారా కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలన్నారు. ఇచ్చిన గ్యారంటీలు హామీలు అమలు జరగాలన్నా, ప్రశ్నించే గొంతుకు బలం చేకూరాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగిందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే మైనారిటీ నాయకుడు అబ్దుల్ జాఫర్ అన్నారు. ఎన్నో ప్రత్యేక పథకాల ద్వారా పదేండ్లలో మైనారిటీల అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేయడమే కాకుండా రాజకీయంగా కూడా సముచిత స్థానం కలిపించి గౌరవించిన సంగతి జూబ్లీహిల్స్‌లో మైనారిటీ కుటుంబ సభ్యులు మరిచి పోవద్దని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించి కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలు మైనారిటీలని ఓటు బ్యాంక్‌లా వాడుకున్నారని, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మైనారిటీలని గౌరవించి అభివృద్ధి చేసిందన్నారు. ఎప్పటికైనా మైనారిటీల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి నవాపేట్, సత్య మూర్తి చిలుముల, రవి కుమార్ రేటినేని, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శులు మల్లా రెడ్డి, సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, ఐటీ, మీడియా కార్యదర్శి పీఆర్ రవి ప్రదీప్ పులుసు, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా కన్వీనర్ అండ్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇన్చార్జ్ తరుణ్ లునావత్, సభ్యులు షేక్ ఇమాం గౌస్, హరి కృష్ణ మామిళ్ళ, మొహ్మద్ అబ్దుల్ ఖుదూస్, దయాల వసంత్ కుమార్ , మహేందర్ పడిగెల, శ్యామ్ రెడ్డి సరికొండ, నాగరాజు, అజయ్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, సాయి కిరణ్, హనీఫ్, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.