కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) ఖాతాలో కొత్త రికార్డు పడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఆ రికార్డును బాబర్ ఆజమ్ బ్రేక్ చేశాడు. టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడతను. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయి చేరుకున్నాడు. 130 మ్యాచుల్లో అతను 4234 రన్స్ చేశాడు. దీంట్లో 36 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. బాబర్ ఆజమ్ స్ట్రయిక్ రేట్ 129గా ఉంది. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో 31 ఏళ్ల బాబర్ ఆజమ్‌కు చోటుదక్కలేదు. అయితే మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించిన అతను తన పేరిట రికార్డును సుస్థిరం చేసుకున్నాడు.
టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు టీ20ల్లో రోహిత్ శర్మ 4231 రన్స్ స్కోరు చేయగా, కోహ్లీ 4188 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో జోష్ బట్లర్(3869), అయిదో స్థానంలో పౌల్ స్టిర్లింగ్(3710) ఉన్నారు.