శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 10:26:31

కూతురితో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ విల‌న్

కూతురితో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ విల‌న్

విల‌క్ష‌ణ న‌టుడు రంజిత్ త‌న కూతురితో క‌లిసి స‌రదాగా డ్యాన్స్ చేశారు. జిమ్‌లో వీరిద్ద‌రు క‌లిసి చేసిన డ్యాన్స్ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రంజిత్ త‌న ఇన్‌స్టాగ్రాములో ఈ వీడియో షేర్ చేస్తూ.. 80 ఏళ్ళుగా న‌న్ను ఎవ‌రు డ్యాన్స్ చేయించ‌లేక‌పోయారు. ఇది కేవ‌లం నా కూతురి వ‌ల‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. రంజిత్ డ్యాన్స్‌పై స్పందించిన టైగ‌ర్‌.. అద్భుతం గోలి అంకుల్‌..చూడ్డానికి బాగుంద‌ని కామెంట్ చేశారు. 

రంజిత్ దాదాపు 200 పైగా సినిమాల‌లో న‌టించారు. విల‌న్ పాత్ర‌లతో ఆయ‌న ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు రంజిత్‌ని గోలి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ప‌లు టీవీ షోల‌లోను న‌టించిన రంజిత్ బాత్ బ‌న్ జాయే, ఐసా దేస్ హై మేరా, గ‌ర్ ఏక్ స‌ప్నా, జుంగీ చ‌లి జ‌లంధ‌ర్, హిట్ల‌ర్ దీదీ, ఆర్‌కే ల‌క్ష్మ‌న్ కీ దునియా, క‌బీ ఐసే జీత్ గ‌యా కోరా, బాబీ జీ గ‌ర్ ప‌ర్ హ‌య్ వంటి షోస్‌తో చాలా పాపుల‌ర్.
logo