Artemis II: చంద్రుడిని దాటి 6400 మైళ్ల దూరం ప్రయాణించనున్న వ్యోమగాములు
Artemis II: చంద్రుడిని చుట్టి వచ్చేందుకు నలుగురు వ్యోమగాలు వెళ్లారు. ఆర్టెమిస్-2లో ప్రయాణిస్తున్న వారు.. చంద్రుడిని దాటి సుమారు 6400 మైళ్ల దూరం ప్రయాణించనున్నారు. 3 గంటలు పట్టే ఆ జర్నీ టైంలో మూన్లోని డార్క్ సైడ్‌ను స్టడీ చేయనున్నారు.
కేప్ కెనరవల్: నాసా ఇవాళ ప్రతిష్టాత్మక మిషన్ చేపట్టింది. ఆర్టెమిస్-2(Artemis II) ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములు రోదసిలోకి వెళ్తున్నారు. ఆ నలుగురూ చంద్రుడిని చుట్టిరానున్నారు. అయితే గతంలో చంద్రుడి మీదకు వ్యోమగాములు వెళ్లినా.. ఇప్పుడు వెళ్లే వ్యోమగాములు జాబిలిని దాటి కాస్త ఎక్కువ దూరమే వెళ్లనున్నారు. చంద్రుడి చుట్టూ సర్కిల్ కొట్టే ప్రక్రియలో .. అవతలి వైపు ఎక్కువ దూరం ప్రయాణించనున్నారు. చంద్రుడికి అవతలివైపు సుమారు 6400 మైళ్లు అంటే సుమారు 10,299 కిలోమీటర్ల దూరం ఆర్టెమిస్ వెళ్లనున్నది. భూమికి ఎప్పుడూ మరో వైపు ఉన్నట్లుగా ఉండే ఆ ప్రాంతానికి ఆస్ట్రోనాట్స్ వెళ్లడం తొలిసారి అవుతుంది. అయితే ఈ దూరాన్ని చుట్టిరావలంటే వ్యోమగాములకు సుమారు మూడు గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆ సమయంలో వ్యోమగాములు చాలా కీలకమైన అంశాలను సేకరించనున్నారు. చంద్రుడి అవతలి వైపు ప్రాంతాన్ని విశ్లేషించనున్నారు. వాటి ఫోటోలను తీయనున్నారు. చంద్రుడి భౌగోళిక ఫీచర్లను స్టడీ చేయనున్నారు. అక్కడ ఉన్న అగాధలను కూడా విశ్లేషించనున్నారు. అనాది కాలం నాటి లావాను కూడా అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ద్రువ ప్రాంతంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు తాజా మిషన్ ఓ దిక్సూచి కానున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్య పరిస్థితిని కూడా నాసా స్టడీ చేయనున్నది.
సుదూర ప్రయాణం వల్ల కలిగే శారీరక మార్పులపై అధ్యయనం చేస్తారు. మార్స్ గ్రహానికి ట్రావెల్ చేయాలంటే కలిగే మార్పులపై కూడా నాసా శాస్త్రవేత్తలు స్టడీ చేయనున్నారు. ఒకవేళ ఈ ట్రిప్‌లో కనుక ఆర్టెమిస్ సిబ్బంది సురక్షితంగా చంద్రుడిని చుట్టి వస్తే, అప్పుడు నాసా భవిష్యత్తులో చేపట్టబోయే ఆర్టెమిస్-4, 5, ప్రాజెక్టులు కీలకం అవుతాయి. ఆ మిషన్స్ ద్వారా చంద్రుడిపై మనుషుల్ని దింపే ఆలోచనలో నాసా ఉన్నది. 2028లో లూనార్ ల్యాండింగ్ చేపట్టాలని నాసా భావిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

