అమరావతి : అమరావతి రాజధాని ( Amaravati Capital ) చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ ( YCP Walkout ) చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో అమరావతి బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, శివసేన, కాంగ్రెస్,ఆప్, జేడీయూ తదితర పార్టీలకు చెందిన బిల్లుకు మద్దతు తెలిపారు.
చర్చల్లో వైసీపీ తరుపున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి రాజధాని అభివృద్ధికి ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మరో 50 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారని ఇందుకు మరో లక్ష కోట్లు అవసరమని , ఇంత పెద్ద ఎత్తున నిధుల సమీకరణ సాధ్యమయ్యే పనేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంకా నెరవేర్చ లేదని, అన్ని హామీలు నెరవేర్చలిందేనని తెలిపారు. హామీలు అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల తరువాత ఆస్తు పంపకం పూర్తి కాలేదని తెలిపారు. గత సీఎం మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారని తెలిపారు.