Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ కామియో రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో వెంకీ, చిరు పాటకు సంబంధించిన వార్తతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ చిత్రంలో వెంకటేశ్ ఎంతసేపు కనిపించబోతున్నాడనే దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు అనిల్ రావిపూడి. వెంకటేశ్ ఇందులో సుమారు 20 నిమిషాలు కనిపిస్తాడని చెప్పాడు అనిల్ రావిపూడి. అంతేకాదు క్లైమాక్స్‌లో చిరంజీవి, వెంకటేశ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్గా సాగుతాయని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ కామెంట్స్‌తో మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్ వినోదాన్ని గ్యారంటీ అని చెప్పకనే చెబుతున్నాడు అనిల్ రావిపూడి.
ఇప్పటికే మన శంకర వర ప్రసాద్ గారు నుంచి రిలీజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుండగా.. శశిరేఖ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రంలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Ajay Bhupati | అజయ్ భూపతి – జయకృష్ణ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!