నాగ చైతన్య (Nagachaitanya), సమంత (Samantha) విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి 4 రోజులు గడుస్తున్నా కూడా.. సోషల్ మీడియాలో దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో చైతు, సమంత విడాకుల గురించి స్పెషల్ డిబేట్స్ పెడుతున్నారు. వాళ్ల పక్కన కూర్చుని చూసినట్లు కారణాలు కచ్చితంగా చెబుతున్నారు అంటూ వాళ్లపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారు అని కొందరు ఖచ్చితమైన కారణాలు ఇవే అంటూ వాళ్ళకు తెలిసింది చెబుతున్నారు. దీనిపై అటు నాగ చైతన్య, ఇటు సమంత అసలు పట్టించుకోవడం లేదు.
ఎవరి పని వాళ్లు చూసుకుంటున్నారు. అయితే విమర్శలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఇదే జరిగింది. నాగ చైతన్య, సమంత విడాకుల గురించి నాగార్జున చాలా ఎమోషనల్ గా స్పందించాడు. అది వాళ్ల వ్యక్తిగత విషయమని.. భార్యా భర్తల మధ్య ఏం జరిగిందో మనం తెలుసుకోలేం.. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు గౌరవించడం మాత్రమే మనకు తెలుసు అంటూ ఆయన తెలిపాడు. వాళ్ల ప్రైవసీకి భంగం కలవకుండా చూసుకోవడం మా బాధ్యత అంటూ చెప్పాడు నాగార్జున (Nagarjuna).
చైతు, సమంత విడాకుల గురించి వెంకటేష్ (Venkatesh) మాత్రం కాస్త విభిన్నంగా స్పందించాడు. చిన్నప్పటి నుంచి నాగ చైతన్య అంటే రామానాయుడు కుటుంబానికి ఎంతో అభిమానం. ఎందుకంటే వాళ్ల వారసుడు ఆయన. వెంకటేష్ కు సొంత చెల్లి లక్ష్మీ కొడుకు నాగ చైతన్య. అందుకే రామానాయుడు కుటుంబానికి చైతూ అంటే ప్రాణం. అతడి పెళ్లి సమయంలో కూడా సురేష్ బాబు, వెంకటేష్ అందరు డాన్సులు కూడా చేశారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య విడాకులు తీసుకోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెబుతున్నారు.
దీనిపై తనదైన శైలిలో స్పందించారు వెంకటేష్. ఒక విషయం గురించి నోరు తెరిచి మాట్లాడే ముందు.. కాస్త మైండ్ తెరిచి మాట్లాడటం నేర్చుకోండి అంటూ సెటైర్ వేశాడు వెంకీ. ఈయన నుంచి ఇలాంటి సెటైర్లు ఊహించడం కష్టమే. కానీ ఇష్టమైన మేనల్లుడి కాపురం కళ్ల ముందే కూలిపోవడంతో వెంకటేష్ బాగా డిస్టర్బ్ అయ్యాడని అర్థం అవుతుంది.
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు