Sankranthiki Vasthunnam | టాలీవుడ్లో అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబినేషన్లో అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న తాజా ప్రాజెక్ట్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). Venky Anil 3గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఇప్పటికే షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేశ్ లుంగీ ధరించి సీరియస్‌గా తుపాకీ పట్టుకుని ఉండగా.. చీరలో ఓ ఐశ్వర్య రాజేశ్ వైపు .. మరోవైపు మోడ్రన్ అవతార్‌లో మీనాక్షి చౌదరి కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్. ప్రస్తుతం సాంగ్ షూట్ కొనసాగుతోంది.
వెంకటేశ్ -మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చే ఈ పాటను డెహ్రాడూన్, ముస్సోరి, రిషికేశ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉండబోతుందట. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
The team of #SankranthikiVasthunam celebrated the birthday of Hit Machine @AnilRavipudi in a joyful mood at the sets 😍
The team is capturing a beautiful song currently amidst the scenic beauty of Mussoorie ❤️🔥#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY,… pic.twitter.com/eU9xaPQWLR
— Sri Venkateswara Creations (@SVC_official) November 24, 2024
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన