Venkatesh | భగవంత్ కేసరి తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేశ్ (Venkatesh)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. Venky Anil 3గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జులైలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో వేసిన భారీ సెట్లో మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్తను షేర్ చేసింది వెంకీ టీం. వెంకటేశ్ మేకప్ వేసుకొని బ్యాక్ టు యాక్షన్ మూడ్‌లోకి వచ్చేశాడు.
షూటింగ్ లొకేషన్లో తీసిన విజువల్స్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. మాజీ పోలీసాఫీసర్ ఫుల్ ఎనర్జీతో మళ్లీ డ్యూటీని మొదలుపెట్టాడు. వెంకీమామ SVC58 సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ ట్రయాంగులర్ క్రైం ఎంటర్టైనర్ షూటింగ్ పొల్లాచ్చిలో జెడ్స్పీడ్లో కొనసాగుతుందంటూ అనిల్ రావిపూడి టీం షేర్ చేసిన వీడియో ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేశ్కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే దిల్ రాజు, వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. తాజాగా మరోసారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
The ex-cop kicks off his DUTY with full ENERGY🤘
Victory @VenkyMama Joins the sets of #VenkyAnil3 x #SVC58 ❤️🔥
The shoot of this triangular crime entertainer is happening at a rapid pace in Pollachi 💥💥
SANKRANTHI 2025 RELEASE 🥳@AnilRavipudi… pic.twitter.com/fBeJhpqnqQ
— Sri Venkateswara Creations (@SVC_official) August 14, 2024
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్