Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో దళపతి 68 (Thalapathy 68)గా వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఓ చిట్ చాట్‌లో వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అజిత్‌కుమార్‌తో తెరకెక్కించిన Mankatha షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నాడు వెంకట్ ప్రభు. విజయ్‌తో పని చేయాలని నాకు అజిత్ సార్ చెప్పారు. ఇక విజయ్‌తో తెరకెక్కిస్తున్న ది గోట్ గురించి ఆయనకు చెప్పినప్పుడు.. Mankatha సినిమా కంటే 100 రెట్లు పెద్దదిగా ఉండాలని అజిత్ చెప్పారు. ఈ ఆలోచన విజయ్ పట్ల అజిత్‌కు ఉన్న నిజమైన అభిమానాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. అజిత్‌కు ప్రమాదం జరిగిన తర్వాత విజయ్‌తో సుదీర్ఘ ఫోన్ సంభాషణ జరిగిందని.. ఆఫ్‌లైన్‌లో విజయ్, అజిత్‌కు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో చెప్పుకొచ్చాడు వెంకట్ ప్రభు.
ది గోట్లో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా అజిత్ కుమార్ ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !