GOAT Movie | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఇక ఈ వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు మీడియాతో ముచ్చటిస్తూ.. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
వెంకట్ ప్రభు సర్.. ఈ సినిమాలో హీరో పేరు గాంధీ. గాంధీ పేరుతో ఉన్న వ్యక్తి తాగే పాత్ర చేస్తున్నాడు ఏంటి అని అడిగాడు. దీనికి ప్రభు సమాధానమిస్తూ.. గాంధీ పేరు పెట్టుకుని తాగకూడదా? అలా రూల్ ఏం లేదుగా.. గాంధీ నా ఫ్రెండ్ పేరు అందుకే ఆ పేరు పెట్టాను. గాంధీ ఎందుకు అల్లర్లు చేస్తాడు? గాంధీ తాగుతాడ అనే ప్రశ్నలు అనవసరం అంటూ ప్రభు తెలిపాడు. మరో రిపోర్టర్ అడుగుతూ.. రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో విజయ్ పార్టీ జెండాకు సంబంధించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని అడుగగా.. అలాంటివి ఏం లేవు. విజయ్ సర్ నన్ను అలాంటివి చేయమని అడుగలేదు అంటూ ప్రకటించాడు. ఇక ఈ సినిమాను వరల్డ్ వైడ్గా 6000 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు.
Also Read..