Haryana Elections : అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణలో జన్నాయక్ జనతా పార్టీ (JJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేజేపీ సీనియర్ నేత పలరాం సైని ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను లోక్సభ ఎన్నికల్లో జేజేపీ నుంచి పోటీ చేశానని, తన విజయానికి పార్టీ శ్రేణులు కలిసిరాలేదని చెప్పారు. కైథాల్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల్లో జేజేపీ జిల్లా అధ్యక్షుడు రణదీప్ కౌల్ పార్టీకి, తనకు మద్దతు తెలపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ తీరుతో విసిగి తాను రాజీనామా చేస్తున్నానని సహచరులు, పార్టీ కార్యకర్తలతో సంప్రదించి భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. పార్టీలో కొనసాగవద్దని సహచరుల నుంచి తనపై ఒత్తిడి నెలకొనడంతో జేజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
కాగా, జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
Read More :