Nimmala Ramanaidu | యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన వైఎస్ జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయకపోయినా.. ప్రతి ఒక్కరిపై రూ.2.50 లక్షల అప్పు ఉంచారని విమర్శించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు.
యలమంచిలి మండలం కాంబొట్లపాలెంలో వరద బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు నిత్యవసర సరుకులను అందజేశారు. అలాగే రూ.10 లక్షల వ్యయంతో రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లులోని తన కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. డయాఫ్రమ్వాల్పై నివేదిక రాకముందే లేని పోని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.