నందమూరి బాలకృష్ణ (Balakrishna), శృతిహాసన్ కాంబోలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి (veera simha reddy). గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రెండో పాట సుగుణ సుందరిని డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ పాట ఏం టైంలో రాబోతుందో తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ నెట్టింట భారీగా వ్యూస్ రాబడుతోంది. కాగా ఉదయం 9:42 నిమిషాలకు ఈ పాటను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ, శృతిహాసన్ మధ్య వచ్చే ఈ పాటను టర్కీలోని అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన స్టైలిష్ డ్యాన్స్ లుక్ పాట ఎలా ఉండబోతుందో చెబుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవనుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. వీరసింహారెడ్డి జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
బాలకృష్ణ, శృతిహాసన్ స్టైలిష్ డ్యాన్స్..
A feast of Balayya's mass energy 🔥#VeeraSimhaReddy second single #SugunaSundari out on 15th Dec at 9:42 AM 💥
Grand Release on 12th Jan, 2023 🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/fMNPKfUHmG
— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2022
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను