నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం వీరసింహారెడ్డి (veerasimhareddy). ఈ సినిమా నుంచి మ్యూజిక్ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సుగుణ సుందరి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. బాలకృష్ణ, శృతిహాసన్ మధ్య వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్ టర్కీలోని అందమైన లొకేషన్లలో స్టైలిష్‌గా సాగుతూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులను బాలకృష్ణ తనదైన స్టైల్లో వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను రామ్ మిర్యాల, స్నిగ్ధ శర్మ పాడారు. ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకునేలా సాగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు.
వీరసింహారెడ్డి జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
Can we declare this song as an instant Blockbuster 🤩 #SugunaSundari from #VeeraSimhaReddy 🎧🕺🏻💃🏻
– https://t.co/tZKJgHq8XC#VeeraSimhaReddyonJan12th pic.twitter.com/6unrMjqeej
— Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also :Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?