Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ వీరధీరసూరన్ (VeeraDheeraSooran). ఈ మూవీకి చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఛియాన్ 62గా వస్తోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ.. పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో విక్రమ్ అభిమానులకు కావాల్సిన వినోదం ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. వీర ధీర సూరన్ జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు సమాచారం. ఇంకేంటి మరి విక్రమ్ అభిమానులు త్వరలోనే థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి. ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విక్రమ్ దీంతోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram)లో నటిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
💥 #VeeraDheeraSooran is all set for a worldwide release on Jan 30! 🤩🔥
Can’t wait to witness vintage #ChiyaanVikram in action alongside the dynamic #SJSuryah!
Official announcement expected soon !! pic.twitter.com/WAt1GFpfJr
— Kollywood Now (@kollywoodnow) January 8, 2025
Oscars 2025 | ఆస్కార్స్ 2025.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఐదు భారతీయ సినిమాలివే..!