Veera Dheera Sooran | ఇటీవలే తంగలాన్ సినిమాతో మంచి హిట్టందుకున్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో చిత్రం వీరధీరసూరన్ (VeeraDheeraSooran). చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఛియాన్ 62గా వస్తోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. విక్రమ్ ఈ సారి పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ సినిమాతో వినోదాన్ని అందించబోతున్నాడని టీజర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
తాజాగా వీరధీర సూరన్ విడుదలకు సంబంధించిన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని్ 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. మరి దీనిపై విక్రమ్ టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే దుషారా విజయన్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విక్రమ్, ఎస్‌యూ అరుణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
విక్రమ్ మరోవైపు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram)లో నటిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!