Varun Tej | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం వీటీ15 (VT15). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొరియన్ కనకరాజు (వీటీ15 వర్కింగ్ టైటిల్) ఫస్ట్ లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా మొదలైంది.
మేర్లపాక గాంధీ, క్రిష్, హీరోయిన్ రితికానాయక్ ఇతర టీం మెంబర్స్ సమక్షంలో ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోంది. మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో టాలీవుడ్లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ డైరెక్టర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా వీటీ 15 ఫస్ట్ లుక్‌లో డ్రాగన్ డిజైన్ ఉన్న జాడిపై కోడ్ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తుండగా.. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తుంది. ఇక వేట హాస్యాస్పదంగా మారితే అంటూ పోస్టర్లో రాసిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది. వరుణ్ తేజ్ చివరగా మట్కా సినిమాలో నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఎఫ్ 3 తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ మేర్లపాక సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
여행이 시작된다 😎🔥
The super entertaining journey of #VT15 begins with an auspicious pooja ceremony❤️🔥
Regular Shoot Commences today 🎬
Get ready for a blockbuster ride full of Laughs, chills, and thrills 💥💥
AN INDO-KOREAN HORROR COMEDY 🐉🥳
Mega Prince @IAmVarunTej… pic.twitter.com/C4yqyetJsn
— UV Creations (@UV_Creations) March 24, 2025
Devara Part 1 | దేవర ప్రమోషన్స్ టైం.. జపాన్‌లో తారక్, కొరటాల శివ బిజీబిజీ
OTT Movies| ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడే సందడి.. ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!
Dia Mirza | రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి.. దియా మీర్జా డిమాండ్