Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ సూట్లో సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ.. మెట్లు దిగుతూ వస్తోన్న పోస్టర్ షేర్ చేస్తూ.. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మట్కా టీజర్ లాంచ్ డేట్, స్థలంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. విజయవాడ రాజ్ యువరాజ్ సెంటర్లోని జీ3 థియేటర్లో టీజర్‌ను లాంచ్ చేస్తున్నట్టు తెలియజేశారు. వరుణ్ తేజ్ సోఫాపై కూర్చొని స్టైలిష్‌గా సిగరెట్ తాగుతున్న లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తూ.. అంచనాలు పెంచేస్తుంది. మట్కాలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మట్కా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ రీక్రియేట్ చేయగా.. దీనికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Get ready to witness the rise and reign of #MATKA Vasu ❤️🔥#MATKATeaser out TOMORROW, OCTOBER 5th 🔥
Massive Launch Event at G3 Theaters – Raj Yuvraj, Vijayawada, 2PM onwards💥💥 pic.twitter.com/Exmw7cacLB
— BA Raju’s Team (@baraju_SuperHit) October 4, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3