Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర తెరపైకి వచ్చింది. చిత్రీకరణ దశలో ఉన్న మట్కా తుదిదశకు వచ్చేసింది. మట్కా ఫైనల్ షెడ్యూల్ కొనసాగుతుంది.
రామోజీఫిలిం సిటీలో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎక్జయిటింగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి.. అంటూ మేకర్స్ తాజా వార్తను అందరితో షేర్ చేసుకున్నారు. మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ నెట్టింట సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. మట్కాలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట.
ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మట్కా ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోగా.. ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రూ.3.6 కోట్ల భారీ మొత్తానికి రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ డిజైన్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేశారు.
The final schedule of Mega Prince @IamVarunTej‘s #MATKA is underway with some key sequences being shot in RFC 💥
Exciting updates coming your way 🤟 pic.twitter.com/BlEOFSQ09k
— BA Raju’s Team (@baraju_SuperHit) September 12, 2024
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు
Jason Sanjay | జేసన్ సంజయ్ డెబ్యూ సినిమా ఈ హీరోతోనేనట..!