Varun Tej | యువ హీరో వరుణ్‌తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించబోతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారు. ఆదివారం వరుణ్‌తేజ్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫైర్ డ్రాగన్ లోగోతో, అక్షరాలతో పోస్టర్ ఆసక్తినిరేకెత్తించేలా ఉంది.
‘వెన్ హాంటింగ్ టర్న్స్ హిలారియస్’ అనే ట్యాగ్‌లైన్ కథాంశం గురించి తెలియజేస్తున్నది. ఇండో-కొరియన్ హారర్ కామెడీ జోనర్లో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మార్చిలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్నందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తారు.