Varun Dhawan ‘Bediya’ Movie | ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘బద్లాపూర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ దావన్. మొదటి నుండి కథా బలమున్న సినిమాలను ఎంచుకంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే గతకొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఈయన ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘భేదియా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా కృతిసనన్ హీరోయిన్గా నటించింది. మడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా దినేష్ విజన్.. హార్రర్ కామెడీ యూనివర్స్‌లో మూడో ఇన్స్టాల్మెంట్గా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో ఈ యూనివర్స్‌లో తెరకెక్కిన స్త్రీ, రూహీ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.
VARUN DHAWAN – KRITI SANON: 'BHEDIYA' FIRST LOOK OUT NOW, TRAILER ON 19 OCT… Team #Bhediya unveils #FirstLook poster… #BhediyaTrailer out on 19 Oct 2022… Stars #VarunDhawan and #KritiSanon… Directed by #AmarKaushik… Produced by #DineshVijan. pic.twitter.com/vmqNfOJeYD
— taran adarsh (@taran_adarsh) October 17, 2022
Read Also:
Nani | మరో కొత్త దర్శకుడిని లైన్లో పెట్టిన నాని?
Kantara Movie | ‘కాంతారా’ మూవీ సరికొత్త రికార్డు.. తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి..!
తమిళనాట సంచలనం సృష్టిస్తున్న ‘PS-1’.. ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా సరికొత్త రికార్డు
Varasudu | ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా?