Baby John | బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటించిన చిత్రం బేబీ జాన్ (Baby John). Kalees డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh), వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో మెరుబోతున్నాడు. బేబిజాన్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. .
బేబిజాన్ డిజిటల్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం 2025 జనవరి చివరి వారంలో స్ట్రీమింగ్ కానుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఓటీటీ ప్రీమియర్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కించారు.ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన Nain Matakka సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని తెలిసిందే.
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ
Sikandar Teaser | సల్మాన్ ఖాన్ సికిందర్ సెన్సార్ అప్డేట్.. టీజర్ రన్‌టైం ఎంతో తెలుసా..?