Sikandar Teaser | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి సికిందర్ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సల్లూభాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సికిందర్ టీజర్‌ను విడుదల చేయనున్నారని తెలిసిందే.
కాగా సెన్సార్ బోర్డు సికిందర్ టీజర్‌కు యూఏ 13+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సెన్సార్ బోర్డు ప్రకారం సికిందర్ రన్‌టైం 1.45 నిమిషాలు. మరి మురుగదాస్ అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఎలాంటి టీజర్‌ను రెడీ చేశాడనేది సస్పెన్స్ నెలకొంది. కాగా టీజర్లో సల్మాన్ ఖాన్ మాస్క్ అవతార్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. సల్లూ భాయ్ మాస్క్ వేసుకొన్న మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్‌గా కనిపించబోతున్నారని ఇప్పటికే ఓ వార్త బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఇన్సైడ్ టాక్.
Megastar #SalmanKhan‘s #SikandarTeaser censored with ‘UA’ certificate. runtime 1 Min 45 secs. #Sikandar pic.twitter.com/wS0pnhY4lA
— MASS (@Freak4Salman) December 24, 2024
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ