Constable Kanakam 2 | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, ఊరు పేరు భైరవకోన సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బెంగళూరు బ్యూటీ కెరీర్లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది కానిస్టేబుల్ కనకం (Constable Kanakam).
వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు.
తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది ప పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్.2026 జనవరి 8 నుంచి ప్రీమియర్ కానున్నట్టు ప్రకటించారు మేకర్స్.1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లెలో అడవి గుట్ట, మహిళల మిస్సింగ్ నేపథ్యంలో ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సీజన్ 2 ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కనకం స్నేహితురాలు చంద్రిక మిస్సింగ్..? ఆ మిస్టరీని కనకం ఎలా చేధించిందనే నేపథ్యంలో సీజన్ 2 ఉండబోతుంది.
ఈ ప్రాజెక్టులో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, మేఘ లేఖ, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ , జ్వాల కోటి, రాకేందు మౌళి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి రెండో పార్ట్ ఎలాంటి ట్విస్టులతో ఉండబోతుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
#ConstableKanakam Season 2 Premiere On EtvWin From January 8 2026🔥 pic.twitter.com/gU37FWqwzT
— Saloon Kada Shanmugam (@saloon_kada) December 28, 2025