Vaadi Vaasal | కథను నమ్మి సినిమా చేసే దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందులోనా స్టార్ హీరో సూర్య (Suriya)తో సినిమా అంటే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెట్రిమారన్ సూర్యతో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు హింట్ ఇచ్చేశాడు వెట్రిమారన్. ఓ చిట్ చాట్‌లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. తాము ఇంకా సినిమా మొదలుపెట్టలేదు.. కాబట్టి సినిమా పేరును మూడి వాసల్గా మార్చే అవకాశాలున్నాయని నిర్మాత వలైపెచ్చు చెప్పారు. అయితే విడుతలై పార్టు 2 సినిమా పూర్తయిన వెంటనే సూర్య సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని చెప్పి అభిమానుల్లో నెలకొన్న డైలామాకు చెక్ పెట్టాడు.
వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. సూరి, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో వెట్రిమారన్ తెరకెక్కించిన విడుతలై పార్టు-1 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందని తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న రెండో పార్టుకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేసి సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు వెట్రిమారన్.
#Suriya‘s Magnum Opus #Vaadivaasal is ON.
Thanu & Vetrimaaran confirmed the same in a recent award function 🔥🔥🔥 pic.twitter.com/tJSB1p3r6U
— AB George (@AbGeorge_) August 16, 2024
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!