Pawan Kalyan | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్‌సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుంటడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు విరామం ఇచ్చి సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్‌లను కంప్లీట్ చేసిన పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌ని కూడా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ వైరలవుతుంది.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. పలు కీలక సన్నివేశాలను పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కిస్తున్నాడు హరీశ్ శంకర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది. ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Read More