Hari Hara Veera Mallu | ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా!
Hari Hara Veera Mallu Trailer | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం 'హరి హర వీర మల్లు: పార్ట్ 1-స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
Hari Hara Veera Mallu Trailer | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1-స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. జూలై 24, 2025న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 3న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై-బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించారు. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

