Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరిహరవీరమల్లు విడుదలైన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఫోకస్ పెట్టాడని తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ పూర్తి చేసినట్టు ఇప్పటికే హరీష్ శంకర్ టీం ప్రకటించింది. అయితే తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా షూట్ దశలో ఉందని తాజా న్యూస్‌తో అర్థమవుతోంది. ఇండస్ట్రీ సర్కిల్ కథనం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీలో వచ్చే సాంగ్ షూట్ కొనసాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దినేశ్ మాస్టర్ సారథ్యంలో ఈ పాట చిత్రీకరణ కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్లో పాల్గొనగా.. తాజా షెడ్యూల్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఫినిషింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై హరీష్ శంకర్ టీం ఏదైనా అధికారిక ప్రకటన ఇస్తుందనేది చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా శ్లోక పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు